తిరుపతి జిల్లాలోని తలకోన జలపాతంలో హాయిగా ఈతకొడుదామని పోయి బండరాళ్ల మధ్యలో ఇరుక్కున్నాడో యువకుడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. జలపాతం వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అతడిని కాపాడేందుకు పోలీసులు.. విశ్వ ప్రయత్నం చేశారు. చివరికి చీకటి పడటంలో ఉదయం తీస్తామని తెలిపారు. రాళ్ల మధ్య ఇరుక్కున్న యువకుడు కర్ణాటకలోని మంగళూరుకు చెందిన సుమన్ (23)గా గుర్తించారు.