ఇద్దరు టీచర్ల వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు రూరల్ జిల్లాలో పార్వతిపురాలో జరిగింది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత విద్యార్థిని సారా మిలేనియమ్.. తన గదిలోకి వెళ్ళి తలుపు బిగించుకొని ఫ్యాన్ కి ఉరివేసుకొని కనిపించిందని పోలీసులు వెల్లడించారు. అయితే తమ కూతురి సూసైడ్ కు ఇద్దరు టీచర్లు నళినా, ఖమర్ తాజ్ కారణమని బాధితురాలి తల్లిదండ్రులు పీఎస్ ఫిర్యాదు చేశారు.