ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురువనున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ప్రకటించింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల విస్తరణ మరింత పెరుగుతుందని, అదే సమయంలో వాయువ్య ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa