ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారు. ఒకవేళ ఆ రోజు హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ ఆలస్యమైతే తిరిగి 6వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. గత వారమే ప్రధాని, హోంశాఖ మంత్రితో అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నించగా.. ఇప్పుడు ఖరారు అయ్యాయి.