ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో ఇటీవల ఘోర రైలు ప్రమాదం జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సిగ్నలింగ్, టెలి కమ్యూనికేషన్ బాధ్యతల్లో ఉన్న ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే ఘోర రైలుప్రమాదం జరిగినట్లు కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులకు నివేదిక అందజేసింది. ఈ ప్రమాదం వెనక ఏదైనా కుట్ర ఉందా అనే విషయంపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున సేఫ్టీ కమిషన్ నివేదికను బయటకు తెలియజేయలేదు.