జీఎస్టీ వసూళ్లు గత నెల జూన్లో రూ.1,61,497 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోల్చితే ఈసారి వసూళ్లు 12 శాతం పెరిగినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెంట్రల్ జీఎస్టీ రూ.31,013 కోట్లుగా, స్టేట్ జీఎస్టీ రూ.38,292 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.80,292 కోట్లు, సెస్సు రూ.11,900 కోట్లుగా ఉన్నాయని ఓ ప్రకటనలో తెలియజేసింది.