ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. పాడేరు ఘాట్ రోడ్ రాజపురం వద్ద ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యారు. డ్రైవర్ తెలివిగా అలోచించి కొండగట్టును ఢీకొని ఆగిపోయేలా చేశాడు. దీంతో బస్సులో 60 మంది వరకు ప్రయాణికులు ఉండగా.. అందరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.