ఈ నెల 20 నుంచి ఆగస్ట్ 11 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొన్ని విపక్షాలు ఐక్య కూటమిగా ఏర్పడి బీజేపీ సర్కారుపై పోరాటం చేయాలని చూస్తున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి, ఢిల్లీ పాలనాధికారాల ఆర్డినెన్స్, బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం తదితర కీలక బిల్లులు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. మరోవైపు మణిపూర్ అల్లర్లపై కేంద్రం వైఖరిని ఎండగట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.