విశాఖపట్నంలో రాయితీపై రూ.50కి కిలో టమాటా ఇస్తున్నారు. ఆధార్ కార్డ్ ఉన్నవారికి కిలో టమాటా రూ.50 కే ఇస్తున్నారు. ఒక్కో ఫ్యామిలీకి ఒక కేజీ పరిమితి విధిస్తూ టమాటా విక్రయం చేస్తున్నారు. సీతమ్మధార, గోపాలపట్నం, ఎంవీపీ రైతు బజార్లలో టమాటా విక్రయం జరుగుతుంది. దిగుబడి తగ్గడంతో బహిరంగ మార్కెట్లలో టమోటాకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.