ఏపీలోని పలాస పట్టణంలో గత అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. 15 ఏళ్ల క్రితం నిర్మించిన కల్వర్టు అక్రమమంటూ అధికారులు కూల్చివేత సామాగ్రితో టీడీపీ నేత నాగరాజు కల్వర్టు వద్దకు చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు పలువురు టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.