గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 42వార్డు రైల్వే న్యూకోలని మసీదువీధి, ప్రైమరీ స్కూల్ వీధి, కన్నారావు వీధి ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గసమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె రాజు 42వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాసరావు తో కలిసి శనివారం పర్యటించారు. కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా కెకె రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొండవాలు, మురికివాడ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.
ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సచివాలయాలు ద్వారా కొండవాలు ప్రాంతాలు మురికివాడల్లో ఆయా లబ్ధిదారులకు విశిష్టమైన సేవలు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బులుసు జగదీశ్, రాష్ట్ర యాత కార్పొరేషన్ చైర్మన్ పిల్లి సుజాత, డైరెక్టర్లుప్రసాద్, నూకరాజు, నాగమణి, సచివాలయం సిబ్బంది, వాలంటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.