ఈ నెల 4వ తేదీన పెదకూరపాడు మండలం ఖమ్మంపాడు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పెదకూరపాడు మండల తహసిల్దార్ క్షమారాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మంపాడు గ్రామంలోని ప్రజలు తమకు ఉన్న సమస్యలపై దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రాతపూర్వకంగా అర్జీ పెట్టుకోవాలన్నారు. ఈ సురక్ష పథకంలో ప్రజలకు కావలసిన అన్ని రకాల సర్టిఫికెట్లు అర్హత ఉంటే మంజూరు చేస్తామన్నారు.