మాకవరపాలెం మండలం గిడుతూరుతో పాటు మండల కేంద్రమైన మాకవరపాలెంలో సోమవారం జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మాట్లాడుతూ ధృవపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ శిబిరాల్లో వాటిని అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు కొనసాగుతుందన్నారు. సంబంధిత అధికారులు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె ఆదేశించారు.