లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకున్న నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో టిడిపి మాజీ కౌన్సిలర్ రెడ్డి రెడ్డి అప్పలనాయుడు, డోనర్ అయిన అతని భార్య లోవ కుమారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పది లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఆదివారం నర్సీపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పది లక్షల రూపాయల చెక్కును ఆ దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకతీతంగా వైసిపి ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.