ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో ఆదివారం ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంలో అన్యమతస్తులకు చోటు ఇస్తున్నారని విమర్శించారు. ప్రజలందరూ కలిసి వెంకటేశ్వర స్వామి ఆస్తులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా అందరు స్పందించాలన్నారు.