‘‘కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని సాధించాల్సన బాధ్యత సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉంది. గత వరదల్లో 193 గ్రామాలు మునిగితే 56 గ్రామాలనే గుర్తించారు. ఇది అన్యాయం. పోలవరం జాతీయ ప్రాజెక్టు. దాని బాధ్యత కేంద్రా నిది. పునరావాసం బాధ్యత కేంద్రానిదే. రూ.33వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా మోదీ ప్రభుత్వం రూ.7,500 కోట్లు మాత్రమే ప్రకటించింది. కేంద్రం ఇచ్చిన ఆ డబ్బును పునరావాసానికి ఖర్చు పెట్టాలి కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించి నిర్వాసి తులను గోదాట్లో కలపాలని చూస్తే సహించేది లేదు.’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. పోలవరం నిర్వాసితుల పునరా వాసం, పరిహారం కోసం ‘పోరుకేక’ పేరుతో చేస్తున్న పాదయాత్ర శనివారం రాత్రి హనుమాన్‌జంక్షన్‌కు చేరుకుంది. సీపీఎం బాపులపాడు మండల కమిటీ బృందానికి ఆతిథ్యం ఇచ్చింది. ఆదివారం ఉదయం లయన్స్ క్లబ్ నుంచి బాపులపాడు మండలంలోని వీరవల్లి, అంపాపురం మీదుగా గన్నవరం వైపు పాద యాత్ర సాగింది. ఈనెల 4న విజయవాడలో తల పెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని శ్రీనివాసరావు ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వై.కేశవరావు, జిల్లా నాయకులు మాగంటి హరిబాబు, బేత శ్రీనివాసరావు, నల్లి ఆంజనేయులు, అబ్దుల్‌బారీ, జుజ్జవరపు ఏసుపాదం, సీఐటీయూ నాయకులు రాజనాల సురేష్, నోచర్ల నాగేశ్వరరావు తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.