పెదపారుపూడిలో టీడీపీ పామర్రు నియోజకవర్గ ఇన్చార్జ్ వర్ల కుమార్‌రాజా సమక్షంలో మండల అధ్యక్షుడు చలసాని రమేష్‌చౌదరి ఆధ్వ ర్యంలో గ్రామ సర్పంచ్ చప్పిడి సమీర(ఇండిపెండెంట్), ఉపసర్పంచ్ నాగనబోయిన గాంధీ, మరో 100 మందితో కలిసి ఆదివారం టీడీపీలో చేరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకే సాధ్యమని, ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారని కుమార్‌రాజా అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావటం తథ్యమన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.