తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తాడిపత్రికి చేరుకుని ఆనందరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. సీఐ ఆనందరావు కుటుంబంలో కలహాలు ఉన్నాయని తెలిపారు. నిన్న రాత్రి గొడవ జరిగిందన్నారు. ఎలాంటి పని ఒత్తిడి లేదని.. కేవలం కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.