నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడు లో వైద్య శిబిరం జరుగుతుందని పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ప్రియాంక తెలిపారు. పెదకూరపాడు లోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ వైద్య శిబిరానికి హాజరయ్య వారందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తమ వెంట తీసుకొని రావాలని డాక్టర్ ప్రియాంక విజ్ఞప్తి చేశారు.