కౌలు రైతు హక్కు పత్రాల మంజూరుకు ప్రభుత్వం చొరవ చూపాలని రాష్ట్ర కౌలు రైతు సంఘం అధ్యక్షులు రాధాక్రిష్ణ , సీపీఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య అన్నారు. సోమవారం బాపట్ల మండలం చుండూరు పల్లి గ్రామంలో ఇటీవల సతీష్ అని రైతుపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో సతీష్ కుటుంబ సభ్యులను నాయకులు పరామర్శించారు. అనంతరం గ్రామంలోని కౌలు రైతుల తో మాట్లాడారు. రైతుకు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని పథకాలు అందాలన్నారు. కౌలు రైతుకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. కౌలు గారు కార్డులు మంజూరు విషయంలో ప్రభుత్వ అధికారులు చొరవ చూపి భూ యజమానితో మాట్లాడి ఒప్పించాలన్నారు. కౌలు రైతు గారు దరఖాస్తు పై భూ యజమాని సంతకం చేయాలని నిబంధన తీసేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
కౌలుదారు కార్డు ద్వారా పంట రుణాలు పొందే అవకాశం ఉందన్నారు. గారు లేకుంటే రుణం పొందే అవకాశం పోతుందని దీనివల్ల పంటకు పెట్టుబడి అందుకుండా పోయే అవకాశం ఉంటుందన్నారు. రైతులు నాయకులతో మాట్లాడుతూ తమ గ్రామ విఆర్ఓ తాసిల్ కడితేనే కౌలు కార్డు ఇస్తాను అని అన్నారని చెప్పారు. యజమానులు కౌలు గారు కార్డు గురించి అపోహలు పడాల్సిన అవసరం లేదన్నారు. కేవలం 11 నెలల కాల పరిస్థితి మాత్రమే ఈ కార్డు చెల్లుబాటులో ఉంటుందన్నారు. పంట రుణం నష్టం భీమా పరిహారం , విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు, రాయితీపై పొందడంతోపాటు తాము పండించిన పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు రాకేష్ రైతులు పాల్గోన్నారు