రాష్ట్రంలో నానాటికీ పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుంటూ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (ఏపీజెన్‌కో) నిరంతరాయ విద్యుత్‌ను అందిస్తోందని ఏపీఈఆర్‌సీ అభినందించింది. హైదరాబాద్ సింగరేణి భవన్‌లోని ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ రంగంపై ఈఆర్‌సీ సోమవారం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి, సభ్యులు పీవీఆర్ రెడ్డి, థాకూర్ రామ్ సింగ్ నేతృత్వంలోని బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ గరిష్ట స్థాయిలో ఉందని ఈఆర్‌సీ అభినందించింది. సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జెన్‌కో ఎండీ చక్రధరబాబు, డిస్కమ్‌ల సీఎండీలు పాల్గొన్నారు.