ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలతో సమావేశమైన నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 04, 2023, 12:24 PM

ఆడపడుచుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను.. అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తాం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ లీడింగ్‌లో ఉందనే వార్తలు వినగానే రాష్ట్రంలోని అరాచకశక్తులన్నీ పారిపోతాయని చెప్పారు. యువగళం పేరిట సాగిస్తున్న పాదయాత్రకు సోమవారం విరామం ఇచ్చిన ఆయన నెల్లూరులో ‘మహాశక్తితో లోకేశ్‌’ కార్యక్రమం ద్వారా మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడపకు చెందిన 10 రూపాయల డాక్టర్‌ నూరి పర్వీన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో మహిళలు ఎంత సురక్షితంగా ఉన్నారో, ఎంతటి గౌరవం పొందారో ఒకసారి గుర్తుచేసుకోవాలని కోరారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా ఉండటంతోపాటు స్వశక్తితో ఆర్థిక స్వావలంభన సాధించగలిగారని చెప్పారు. మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం లేని వైసీపీ నాయకుల పాలనలో ఎక్కడ చూసినా ఆడపడుచులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ‘‘తల్లీ.. మీరెవరూ భయపడవద్దు. మరో తొమ్మిది నెలలు నిబ్బరంగా ఉండండి. 2024 ఎన్నికల్లో టీడీపీ లీడింగ్‌లో ఉందనే వార్త వింటారు. ఆ వార్త చెవినపడిన వెంటనే అరాచకశక్తులు రాష్ట్రం నుంచి పారిపోతాయి. ఆడపడుచుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఏ ఒక్కరినీ మీ లోకేశ్‌ వదిలిపెట్టడు. ఆ బాధ్యత నాది.. నన్ను నమ్మండి..’’ అంటూ ఆవేశంగా మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com