వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా వారాహి యాత్ర సాగుతోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... జగనన్న సురక్ష దేని కోసం.. ఇంకెన్ని పేర్లుపెట్టి జనాన్ని మోసం చేస్తారని ధ్వజమెత్తారు. ‘గతంలో సమస్యల పరిష్కారం కోసం స్పందన అని పెట్టారు. దానికి ప్రభుత్వం నుంచే స్పందన లేకుండా పోయింది. ఇది చాలదని జగనన్నకు చెబుదామంటూ మరోటి తీసుకొచ్చారు. వినే మనస్తత్వమే లేని జగనన్న ఈ కార్యక్రమాన్ని పెడితే.. ఎమ్మెల్యేలు, ఎంపీలే కాకుండా, అధికారులు కూడా ప్రజల గోడు విన్నదే లేదు. మళ్లీ ఇప్పుడు జగనన్న సురక్ష అంటూ ఇంకో పఽథకం తెచ్చారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు పఽథకం పెట్టారంటే జగనన్న పాలన ఎంత చక్కగా ఉందో అర్థమవుతోంది. మీ పాలన బాగుంటే ఒక్క రోజులో 9.48 లక్షల అర్జీలు ఎందుకొచ్చాయి? ఇదే దారుణమంటే, అదే రోజు 3.69 లక్షల దరఖాస్తులు పరిష్కారమైనట్లు ప్రకటించడం మరింత విడ్డూరం. ఒక్క రోజులో ఇన్ని పరిష్కారమైతే.. మరి నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ఏం చేసింది? బటన్ నొక్కి రోజులు గడుస్తున్నా అమ్మఒడి డబ్బు ఎందుకు పడలేదు’ అని నిలదీశారు.