నెల్లూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోందని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నెల్లూరు రూరల్లో పాదయాత్ర సాగుతుంటే రద్దీ వల్ల తానే వెళ్లలేక తిరిగొచ్చినట్లు చెప్పారు. మహాశక్తితో లోకేశ్ కార్యక్రమానికి 800 మందిని అంచనా వేస్తే 3 వేల మంది వచ్చారన్నారు. నాయకుడంటే తిట్టడం... తిట్టించుకోవడం కాదని.. అభివృద్ధే లక్ష్యం కావాలన్నారు. తాను అభివృద్ధి గురించే ఆలోచిస్తానని... టీడీపీ హయాంలో నగరాన్ని ఎంత అభివృద్ది చేశామో అందరికీ తెలుసని నారాయణ వెల్లడించారు.