రాష్ట్రంలో ప్రతి పేదవాని సొంతింటి కలను సాకారం చేయాలన్నదే సీఎం వై. ఎస్. జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒక్క రూపాయికే రూ. 10 లక్షల విలువ చేసే గృహాలుఅందించామన్నారు. రానున్న ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2. 60 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయను న్నట్టు చెప్పారు. యలమంచిలిలోని ఎర్రవరం సమీపంలో హైవే వద్ద నిర్మాణం పూర్తిచేసిన టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ఎమ్మెల్యే కన్నబాబురాజు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, కలెక్టర్ రవి పట్టాన్ శెట్టిలతో కలిసి మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం ప్రారంభించారు. లబ్దిదారులకు రిజిస్ట్రే షన్ పత్రాలు, ప్లాట్ తాళాలు అందజేశారు. సదు పాయాల గురించి లబ్ధిదారులను ఆరా తీశారు. వారంతా బాగున్నాయని చెబుతూ సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సొంతింట కల నెరవేరడంతో వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.