ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని గజపతినగరం ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక, జడ్పిటిసి గార తౌడు అన్నారు. మంగళవారం గజపతినగరం మండలంలోని కాలంరాజుపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ గేదెల ఈశ్వరరావు అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పలువురికి ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గేదెల జగదీష్, ఎంపీడీవో కొవ్వాడ కిషోర్ కుమార్, వైసిపి నాయకులు బెల్లాన త్రినాధరావు కరణం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.