మాతా శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ వాగ్దేవి ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ గర్భిణీల మరియు బాలింతలకు వారి ఇంటి వద్ద ఆశా కార్యకర్తల ద్వారా పౌష్టికాసారము అందిస్తున్నామన్నారు. ప్రతినెలా వైద్య తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామనీ, అలాగే ఊర్లోనే ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.