విజయనగరం జిల్లా కేంద్రంలో గల రోడ్డు రవాణా శాఖ కార్యాలయం మరియు గుడి వద్ద ప్రభుత్వ మద్యం దుకాణం పెట్టడాన్ని నిరసిస్తూ మంగళవారం తెలుగుదేశం నాయకులు బుద్ధ వెంకన్న, కొండ్రు మురళి, కేఏ నాయుడు మద్యం దుకాణం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు, చెవులు లేకుండా పనిచేస్తుందన్నారు. ఓ ప్రభుత్వ కార్యాలయం మరియు గుడి వద్ద ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు.