స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 274 పాయింట్లు లాభపడి 65,479 వద్ద ముగిసింది. నిఫ్టీ 66 పాయింట్లు పుంజుకుని 19,389 వద్ద నిలిచింది. ఐటీ, టెక్, బ్యాంక్ షేర్లు మార్కెట్లను నడిపించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫైనాన్స్ (7.17%), బజాజ్ ఫిన్ సర్వ్ (5.76%), టెక్ మహీంద్రా (2.39%), సన్ ఫార్మా (1.61%), ఎన్టీపీసీ (1.54%).
టాప్ లూజర్స్ : భారతీ ఎయిర్టెల్ (-1.54%), యాక్సిస్ బ్యాంక్ (-1.18%), రిలయన్స్ (-1.03%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.89%), టాటా స్టీల్ (-0.57%).