ఏపీలో నేడు పాఠశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అలాగే, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, తక్షణమే డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని ఏబీవీపీ తెలిపింది. నేటి పాఠశాలల బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.