విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టాస్క్ఫోర్స్, సీసీఎస్ విభాగాలకు పోలీస్ స్టేషన్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. టాస్క్ఫోర్స్ విభాగానికి పోలీస్ స్టేషన్ లేకపోవడంతో కేసులు నమోదుకు అవకాశం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ఫోర్స్, సీసీఎస్లకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ హోదాను ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.