ప్రజలకు సేవలందించేందుకే వలంటీర్లు ఉన్నారని, ఎక్కడైనా వలంటీర్లపై ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు తప్పవని యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుఅన్నారు. అచ్యుతాపురం మండలం లోని చీమలాపల్లి, చోడపల్లి గ్రామాల్లో జగనన్న సురక్ష సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. వలంటీర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు అవసరమై ధ్రువ పత్రాలను అందజేస్తున్నామని తెలిపారు.