రైల్వే వాల్తేర్ డివిజన్ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది వృద్ధి సాధించిం దని వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎకెత్రిపాఠి బుదవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 2021 ఆర్థిక సంవత్సరంలో 5. 50 మిలియన్ టన్నుల సరకును లోడ్ చేసి రూ. 623. 34 కోట్ల ఆదాయం సాధించగా, ఈ ఏడాది 5. 98 మిలియన్ టన్నుల సరకును లోడ్ చేసి రూ. 700. 20 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు వెల్లడించారు.