ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు కొత్త హల్ట్ లను కల్పిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుందని ఎకె త్రిపాఠి బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నెల 6 నుంచి విశాఖ-కోర్బా- విశాఖ(18518-18517) రైళ్లకు సింగాపూర్ రోడ్, గుంటూరు-రాయ గడ(17243) ఎక్స్ప్రెస్కు భీమడోలు స్టేషన్ హాల్ట్ కల్పించారన్నారు. ఈ సౌకర్యం ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుందన్నారు.