ముఖ్యమంత్రి జగనన్న నూతనంగా ప్రారంభించిన 108 అంబులెన్స్ వాహనాన్ని నాగలాపురంకు మంజూరు చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం సాయంత్రం స్థానిక పీహెచ్సీ వద్ద కొత్త అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించారు. గతంలో అంబులెన్సులు మరమ్మతులు తరచూ గురికావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. కొత్త అంబులెన్స్ రాకతో రోగులు ఇన్నాళ్లు పడ్డ అవస్థలు ఇకపై ఉండవని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.