విజయవాడలోని హోటల్ ఐలాపురం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెమినార్ కు వెళ్తున్న తెలుగు మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, తెలుగు మహిళలకు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం అల్లర్లకు తెరలేపాయి. అయితే 'సోషల్ మీడియా - మహిళలపై దాడి' అంశంపై సెమినార్ చేయగా.. టీడీపీ నేత వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కార్యక్రమానికి వెళ్తున్న మహిళా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.