గంపలగూడెం మండలం పెనుగొలనులో బుధవారం అనారోగ్య బాధితులకు 104 సంచార వాహన సేవలు నిర్వహించారు. డాక్టర్ మనోజ్ పర్యవేక్షణలో రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక రోగాలకు, గర్భిణీలు, బాలింతలకు, వివిధ జబ్బులతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. సిహెచ్ఓ. సుల్తానా, ఆరోగ్య సిబ్బంది పుల్లారావు, ఏఎన్ఎం ఎల్. సుకన్య, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.