మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేసులో జోక్యానికి సిద్ధంగా లేమని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు అభిప్రాయాలతో సంబంధం లేకుండానే హైకోర్టు స్వతంత్రంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇందుకు సంబందించి లిఖితపూర్వక ఆదేశాలు గురువారం ఇస్తామని ధర్మాసనం తెలిపింది.