ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల కార్యక్రమాల షెడ్యూల్ ప్రకారం గురువారం మైదుకూరు మునిసిపాలిటీ లోని పోలింగ్ బూత్ నెంబర్ 89 వినాయక నగర్ లో బుత్ స్థాయి ఇంటింటా ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మైదుకూరు నియోజకవర్గం కన్వీనర్ మాచనూరు సుబ్బరాయుడు, మైదుకూరు మండల అధ్యక్షుడు రామకృష్ణ, మాజీ రాష్ట్ర కౌన్సిలర్ ఏవి సుబ్బన్న, కిషోర్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.