విజయనగరం జిల్లాకు చెందిన నవీన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి పరిచయమైంది. తరచూ ఆమెతో చాటింగ్, కాల్స్ చేయడంతో ఇద్దరి మధ్య చనువు పెరిగి ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారిద్దరూ ఏకాంతంగా వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు. ఆ వీడియో కాల్స్‌ను నవీన్ రికార్డ్ చేసుకుని బ్లాక్ మెయిల్ చేశాడు. దాంతో భయపడిన బాధితురాలు మొదటగా రూ.25 వేలు ఇచ్చింది. ఆ తర్వాత లక్ష రూపాయలు ఇవ్వాలని నవీన్ డిమాండ్ చేశాడు. దాంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.