రైతులు, రైతు సంఘం నాయకులు శుక్రవారం ఇరిగేషన్ కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. భారీ వర్షాలకు ఎద పద్ధతిలో సాగు చేస్తున్న వరి పొలాలు ముంపుకు గురయ్యాయని ఎకరాకు దాదాపుగా 15 వేల వరకు నష్టపోయామని వాపోయారు. సకాలంలో సాగునీటి కాలువలు పూడిక తీయకపోవడంతోనే పొలాలు మునిగాయి, దీనికి అధికారులే బాధ్యులని ఆరోపించారు. ఇరిగేషన్ అధికారులు దీనిపై స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతుంది.