తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చీనీ తోటకు పంట భీమా డబ్బులను ఎమ్మెల్యే కేతిరెడ్డి కొట్టాశారంటూ జేసీ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈక్రమంలో జేసీకి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్ విసిరారు. క్రాప్ ఇన్సూరెన్స్ అందరి రైతులకు వచ్చినట్లే తనకూ పంట బీమా వచ్చిందని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదని... కాబట్టి ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అంత పనికిమాలిన ఎదవను ఈ రాష్ట్రంలో తాను ఎవరినీ చూడలేదన్నారు. పుట్లూరు, ఎల్లనూరు మండలాలలో మగాడు అనే వాడు ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తన తోటలో అడుగు పెట్టు చూడు అంటూ సవాల్ విసిరారు. ‘‘నాకు ఎమ్మెల్యే పదవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష. ఈ పదవి లేకపోతే జేసీని ఇంటిలో నుంచి లాక్కుని వచ్చి చెప్పు తీసుకొని కొట్టి తాడిపత్రి పట్టణమంతా తిప్పుతానంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.