ఈసెట్ కౌన్సెలింగ్ ఈనెల 14న ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. డిప్లొమా పూర్తిచేసుకుని ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను శుక్రవారం ఆమె విడుదల చేశారు. 14 నుంచి 17 వరకు దరఖాస్తులు చేసుకుని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని, 17 నుంచి 20 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని వివరించారు. 19 నుంచి 21 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చన్నారు.