పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ వైపు పంచాయతీ ఎన్నికల పోలీంగ్ జరుగుతుండగా.. మరోవైపు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల జరిగిన ఘర్షణల్లో ముగ్గురు తృణమూల్ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. పరగణాస్ జిల్లాలోని పిర్గాచాలో స్వతంత్ర అభ్యర్థిని హత్య చేశారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, టీఎంసీ అభ్యర్థి మున్నా బీబీ భర్త హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు పలువురు నిరసనకు దిగారు. ఈ మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఆందోళనను అదుపులోకి తీసుకొచ్చారు.