పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హింసాకాండ నెలకొంది. శనివారం జరుగుతున్న పోలింగ్ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన ఏడుగురి హత్య జరిగింది. నలుగురు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తలు చనిపోగా.. కూచ్ బెహార్‌లో బీజేపీ పోలింగ్ ఏజెంట్‌ను కాల్చి చంపారు. మరో ఘటనలో సీపీఎం కార్యకర్త కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. అలాగే మల్దా జిల్లాలో ఒక టీఎంసీ కార్యకర్త బాంబు దాడిలో మరణించాడు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు నెలకొన్నాయి.
మరోవైపు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల జరిగిన ఘర్షణల్లో ముగ్గురు తృణమూల్ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. పరగణాస్ జిల్లాలోని పిర్గాచాలో స్వతంత్ర అభ్యర్థిని హత్య చేశారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, టీఎంసీ అభ్యర్థి మున్నా బీబీ భర్త హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు పలువురు నిరసనకు దిగారు. ఈ మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఆందోళనను అదుపులోకి తీసుకొచ్చారు.