రాజధానిలో ఆర్-5 జోన్‌లో దళిత రైతులకు జరుగుతున్న అన్యాయంపై పాదయాత్ర చేసేందుకు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అనుమతి కోరారు. గత నెల 24వ తేదీన ప్రభుత్వం అనుమతిని తిరస్కరించింది. దీంతో ఈ నెల 8వ తేదీన పాదయాత్ర చేసేందుకు అనుమతి ఇవ్వాలని శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా జడ శ్రావణ్‌కు హైకోర్టు అనుమతిచ్చింది. నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పాదయాత్ర చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 200 మందితో పాదయాత్ర చేసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. 200 మంది ఆధార్ కార్డులు పోలీసులకు ఇచ్చి అనుమతి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.