దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు పెద్దఎత్తున హాజరయ్యారు. మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి లో వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి , ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి , ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజ గోపాల్ రెడ్డి , మేకపాటి అభినయ్ రెడ్డి నివాళులర్పించారు. మహానేత విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాలులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. మహానేతకు మరణం లేదని, ఆయన చిరకాలం తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి కొనియాడారు.