శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పి ఆర్ టి స్ట్రీట్ శనివారం నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ కుమార్, నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ వైయస్ఆర్ అంటూ నినాదాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.