తిరుమల దేవస్థానం ప్రాంతంలోని అలిపిరి తనిఖీ కేంద్రంలో రెండు టీవీలను గుర్తు తెలియని వ్యక్తులు తిరుమలకి తీసుకుని వచ్చారు. తిరుమల జీఎన్సీ వద్ద ద్విచక్ర వాహనాల తనిఖీల్లో భాగంగా కానిస్టేబుల్ వారిని ఆపి చెక్ చేయగా... టీవీలు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా తెలుస్తోంది. పలు ప్రదేశాల్లో సెకండ్ హ్యాండ్ టీవీలు అమ్మకాలు చేస్తున్నట్లు సదరు వ్యక్తులు తెలిపారు. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.