ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్విట్టర్ ద్వారా ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 08, 2023, 01:50 PM

‘‘బకాయిలు చెల్లించాలని కోరినందుకు ధర్మవరానికి చెందిన చేనేత వర్గ వస్త్ర వ్యాపారులపై విజయవాడలో వైసీపీ గూండాలు అమానుష దాడికి పాల్పడ్డారు... బాధితులను నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం పొందారు. రోడ్డు వేయమని ఉపముఖ్యమంత్రిని అడిగిన పాపానికి చిత్తూరు జిల్లాలో దళిత వర్గానికి చెందిన కానిస్టేబుల్‌పై కేసు పెట్టారు..... సస్పెండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో పింఛను డబ్బు అడిగిన వితంతు మహిళపై కేసు పెట్టారు. రోజుకో ఘోరం... ప్రతి చోటా ప్రభుత్వ టెర్రరిజం. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు శాఖను వైసీపీ అనుబంధ విభాగంగా మార్చిన దుస్థితే ఈ పరిస్థితికి కారణం. ఈ ప్రభుత్వానికి తమ పోకడలపై ప్రజలు ఏమనుకుంటారో అని లేదు... సమాజం గమనిస్తోందనీ లేదు. ఈ వైసీపీ ప్రభుత్వ పాపాలకు ప్రజలు తిరుగులేని గుణపాఠం చెప్పడం మాత్రం ఖాయం’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com